Pawan Kalyan: దేవి నవరాత్రుల్లో భాగంగా ఏడవరోజు బుధవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కూతురు ఆధ్య తో ఆయన దర్శనానికి వచ్చారు.
Pawan Kalyan: అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటేత్తారు. దీంలో అధికారులు అన్ని టిక్కెట్లు రద్దు చేసి, అన్ని క్యూలైన్లలో ఉచితంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
కాగా బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి మూడు గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకోనున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా నగరంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని సీపీ తెలిపారు