Pattabhi: శ్రీవారి లడ్డూ.. రూ.251 కోట్ల కుంభకోణం

Pattabhi: శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించిన వ్యవహారంపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా స్పందించారు. మంగళగిరిలో సోమవారం జరిగిన ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం హయాంలో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం కూడా కల్తీ కబంధానికి గురైందని ఆరోపించారు.

పట్టాభి వెల్లడించిన వివరాల ప్రకారం, భోలే బాబా డెయిరీ మరియు సుగంధ ఆయిల్ అండ్ కెమికల్స్ సంస్థ కలిసి ప్రమాదకర రసాయనాలతో నెయ్యి తయారు చేసి, టీటీడీకి సరఫరా చేశాయి. ఈ వ్యవహారంలో రూ.251 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని తెలిపారు.

2022-24 మధ్య భోలే బాబా డెయిరీకి రూ.8 కోట్ల విలువైన రసాయనాల సరఫరా.ఈ రసాయనాలతో 68.17 లక్షల కిలోల నెయ్యి తయారు చేసి టీటీడీకి పంపిణీ. ప్రమాదకర రసాయనాలు – మోనోగ్లిసరైడ్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్‌లు వంటి పదార్థాలు ఉపయోగించారని పేర్కొన్నారు.

వైవీ సుబ్బారెడ్డిపై ఆరోపణలు: ఈ వ్యవహారంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపై కూడా పట్టాభి తీవ్ర ఆరోపణలు చేశారు. 2022లోనే నెయ్యిలో పామాయిల్ కలిసిందని నివేదికలు వచ్చినా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.భోలే బాబా యజమాని సుబ్బారెడ్డిని కలిసిన విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

టెండర్‌లలో అక్రమాలు:

పట్టాభి ప్రకారం, ఎన్నికల ముందు టెండర్‌లలో కూడా అక్రమాలు జరిగాయి.భోలే బాబా డెయిరీ డైరెక్టర్లే ఏఆర్ డెయిరీ పేరుతో మరో సంస్థను నడిపి, తమకనుకూలంగా నిబంధనలు మార్చుకున్నారని చెప్పారు.6తద్వారా కేవలం రూ.319కే 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా ఆర్డర్ పొందారని ఆరోపించారు.

పట్టాభి వ్యాఖ్యలు: “రసాయన నెయ్యిని స్వామివారి నైవేద్యంలో ఉపయోగించి మహా పాపానికి ఒడిగట్టారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇంత పెద్ద కుంభకోణాన్ని కమీషన్ల కోసం దాచిపెట్టిన వైసీపీ నాయకులు సిగ్గుపడాలి” అని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *