Patnam Narender Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, లగచర్ల ఘటన కేసులో జైలులో ఉన్న పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. లగచర్ల దాడి ఘటనలో కేసు నమోదుపై కొడంగల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఇటీవల ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని జిల్లా కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
Patnam Narender Reddy: లగచర్ల దాడి ఘటన కేసులో పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు అయ్యారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా, ఆ రిమాండ్ గడువు నవంబర్ 27న ముగిసింది. అయితే కొడంగల్ మెజిస్ట్రేట్ మరో 14 రోజులు ఆయనకు రిమాండ్ గడువు పొడిగించారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నారు.