Liquor Ban: బీహార్‌లో మద్య నిషేధంపై తలెత్తుతున్న ప్రశ్నల మధ్య పాట్నా హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్య చేసింది. అధికారులు నిషేధాన్ని ఇష్టపడతారని, వారికి అది భారీగా డబ్బులు తెచ్చిపెడుతుంది అని హైకోర్టు పేర్కొంది. దీంతో పాటు నిషేధ చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌పై జారీ చేసిన డిమోషన్ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. స్మగ్లర్లతో సన్నిహితంగా పనిచేసే పోలీసులకు ఈ నిబంధనలు ఉపయోగకరంగా మారాయని కోర్టు వ్యాఖ్యానించింది.
జస్టిస్ పూర్ణేందు సింగ్, పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులే కాదు, వాణిజ్య పన్నుల శాఖ మరియు రవాణా శాఖ అధికారులు కూడా నిషేధాన్ని ఇష్టపడతారని అన్నారు. వారికి అది పెద్ద డబ్బు తెచ్చిపెట్టే పథకం అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి, మద్య నిషేధం అలాగే ఇతర నిషేధిత వస్తువులు.. అనధికారిక వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ కట్టుదిట్టమైన నిబంధనలు స్మగ్లర్లతో సన్నిహితంగా పనిచేసే పోలీసులకు అనుకూలమైన సాధనంగా మారాయి అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Indian Railways: రైళ్ల దగ్గర రీల్స్ చేస్తే.. సరదా తీర్చేస్తారు
Liquor Ban: పాట్నా బైపాస్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న ముఖేష్ కుమార్ పాశ్వాన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు జరిపిన దాడిలో విదేశీ మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాశ్వాన్‌ను సస్పెండ్ చేశారు. దర్యాప్తు సమయంలో తనను తాను నిర్దోషి అని పేర్కొన్నప్పటికీ, నవంబర్ 24, 2020 న, రాష్ట్ర ప్రభుత్వం పాశ్వాన్‌పై డిమోషన్ ఆర్డర్ జారీ చేసింది. కోర్టు ఈ ఆర్డర్లను ఇప్పుడు కొట్టివేసింది. ఈ కేసు విచారణ సందర్భంగానే తీవ్రవ్యాఖ్యలు చేసింది హైకోర్టు.