Viral News: సాధారణంగా విమానం ఆలస్యమైతే ప్రయాణికులు అసహనానికి గురవుతారు. కానీ ఈసారి గోవా ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటన మాత్రం భిన్నంగా మారింది. విమానం ఆలస్యమైనా, ప్రయాణికులు చిరాకు పడకుండా గర్బా నృత్యంతో కాలక్షేపం చేస్తూ అక్కడి వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చేశారు.
గోవా నుంచి సూరత్‌కు వెళ్లాల్సిన ఇండిగో (IndiGo) విమానం పైలట్ అనారోగ్యానికి గురవడంతో ఆలస్యం అయింది. ఈలోగా సూరత్‌లో జరగబోయే గర్బా వేడుకలో పాల్గొనలేకపోతున్నానని ఒక ప్రయాణికుడు మయూర్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాడు. అతడి మనసు మార్చేందుకు ఇండిగో సిబ్బంది ప్రత్యేక ఆలోచన చేశారు.
ఇది కూడా చదవండి: Raghunandan rao: ప్రభుత్వం మాత్రం మూసీ పేరుతో రాజకీయాలు చేస్తోంది
అక్కడే స్పీకర్‌లు ఏర్పాటు చేసి గర్బా పాటలు ప్లే చేయడంతో, ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే గర్బా డ్యాన్స్ మొదలుపెట్టారు. సిబ్బంది కూడా వారితో కలసి నృత్యం చేయడం ప్రారంభించడంతో, విమానం ఆలస్యం కారణంగా ఏర్పడిన నిరాశ క్షణాల్లో ఉత్సాహంగా మారింది.
ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాసేపట్లోనే వైరల్‌గా మారింది.“విమాన ఆలస్యమైందని బాధపడ్డా.. గర్బా నృత్యం ఆడిన ఈ రోజు మరచిపోలేనిది” అని ఒక ప్రయాణికుడు ఆనందాన్ని వ్యక్తం చేశాడు.అయితే, ఈ సంఘటనపై నెటిజన్లలో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. కొందరు ఇండిగో సిబ్బంది ఆలోచనను ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం “ఎయిర్‌పోర్ట్ మర్యాదలకు ఇది తగదు” అంటూ విమర్శిస్తున్నారు.
सुरतियो ने गोवा एयरपोर्ट को बनाया गरबा ग्राउंड
इंडिगो की फ्लाइट में 7 घंटे की देरी होने पर सूरत एयरपोर्ट पर यात्रियों ने गरबा खेलकर जश्न मनाया pic.twitter.com/aBCT4x4zN5— Khushbu_journo (@Khushi75758998) September 30, 2025