Partha sarathi: గత ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని అప్పల ఊబిలో దింపిందని మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం దించేసిందని తెలిపారు. యువతి యువకులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని చెప్పారు. గత ప్రభుత్వ హయంలో 200 రూపాయలు . . ఓ పత్రిక కొనుగోలు చేయాలని ఇచ్చారు. దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు.కొన్ని పత్రికలకు అర్హత లేకపోయినా కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చారని చెప్పారు.
రాష్ట్రానికి ఆదాయ వనరులు వచ్చే అవకాశాన్ని, అభివృద్ది చేయలేదని చెప్పారు. ఈ పరిస్ధితుల్లో ఎన్నికల్లో ఇచ్చిన హమీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. పెన్షన్ ను 4వేలకు పెంచి మూడునెలల బకాయిలను కలిపి 7 వేలు ఇచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన 1600 కోట్లు రైతుల బకాయిలు ఇచ్చామని తెలిపారు.
కేంద్రం మంచి ఉద్దేశంతో భూ హక్కుల చట్టాన్ని తేవాలని ఆలోచన చేస్తే ఆ చట్టంలో అన్ని తమకు నచ్చేలా నిభందనలు మార్చారని వారి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేశామని చెప్పారు. 16,700 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ కోసం చర్యలు తీసకుంటున్నామని అన్నారు.
ప్రజలను కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా వారికి బంగారు భవిష్యత్తును ఏర్పాటుచేస్తున్నామని అన్నారు. హౌసింగ్ విషయంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారిమల్లించి పేదలకు అన్యాయం చేశారని చెప్పారు.
మరిన్ని ఏపీ పాలిటిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

