Jamili Elections Bill

Jamili Elections Bill: జ‌మిలి ఎన్నిక‌లపై కేంద్రం పున‌రాలోచ‌న‌

Jamili Elections Bill: గ‌త కొన్నాళ్లుగా కేంద్రం హ‌డావుడిగా మొద‌లు పెట్టిన‌ జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌క్రియ బిల్లుల‌పై పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ శీతాకాల‌ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంపై సందిగ్ద‌త నెల‌కొన్న‌ది. లోక్‌స‌భ సెష‌న్ ప్ర‌కారం ప్ర‌వేశ‌పెట్టే జ‌మిలి బిల్లులు లేక‌పోవ‌డంతో ఈ విషయం బ‌య‌ట‌కు తెలిసింది. ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన ప్ర‌క్రియ‌లో కేంద్రం ఎందుకు వెనుకంజ వేస్తున్న‌దో అన్న చ‌ర్చ దేశ‌వ్యాప్తంగా మొద‌లైంది.

Jamili Elections Bill: మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నాయ‌క‌త్వంలో జ‌మిలి ఎన్నిక‌ల‌పై ఓ క‌మిటీని కేంద్ర‌ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీ రూపొందించిన నివేదిక‌ను ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వానికి అంద‌జేసింది. లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను కూడా నిర్వ‌హించాల‌ని రామ్‌నాథ్ కోవింద్ క‌మిటీ కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ప‌క్క‌న పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వం లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకేసారి నిర్వ‌హించేందుకు రూపొందించిన రెండు బిల్లుల‌ను ఈ నెల 12న కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించింది.

ఇది కూడా చదవండి: Gujarat: చేసే పని నచ్చలేదు అని..ఏకంగా చేతి వెళ్ళి నే కత్తిరించుకున్నాడు

Jamili Elections Bill: జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు క్లిష్ట‌మైన విష‌యాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం లోతుగా ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది. జ‌మిలి ఎన్నిక‌ల అమ‌లు కోసం రాజ్యాంగంలోని 82ఏ నూత‌న అధిక‌ర‌ణాన్ని చేర్చాల్సి ఉంటుంది. పార్ల‌మెంట్ ప‌ద‌వీకాలం మార్పు కోసం అధిక‌ర‌ణం 83ని, అసెంబ్లీ ప‌ద‌వీకాలం స‌వ‌ర‌ణ‌కు అధిక‌ర‌ణం 172ని, ఎన్నిక‌ల నిబంధ‌న‌ల రూప‌క‌ల్ప‌న కోసం, పార్ల‌మెంట్‌కు అధికారం క‌ల్పించే అధిక‌ర‌ణం 327ని స‌వ‌రించాల్సి ఉంటుంది. ఈ చ‌ర్య‌లు తీసుకోక‌పోతే లోక్‌స‌భ‌, అసెంబ్లీల స‌మ‌యాలు మార్చ‌డం క‌ష్ట‌త‌రం అవుతుంది.

Jamili Elections Bill: ఈ నెల 16న లోక్‌స‌భ‌ బిజినెస్ జాబితాలో తొలుత జ‌మిలి ఎన్నిక‌ల రెండు బిల్లుల‌ను చేర్చారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘావాల్ ఈ బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెడ‌తార‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. మార్పు చేర్పుల నేప‌థ్యంలో మారిన బిజినెస్ జాబితాలో ఈ జ‌మిలి బిల్లులు లేవు. ఈ నెల 20న ఈ పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగియ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ శీతాకాల పార్ల‌మెంట్‌ స‌మావేశాల్లో బిల్లులు ప్ర‌వేశ‌పెట్ట‌డంపై సందిగ్ధం నెల‌కొన్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Amaravati: కీలక నిర్ణయాలు – రాజధానిలో భూ కేటాయింపులకు ఆమోదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *