హైదరాబాద్ నగరం లోని ఆ ఏరియాలో నిత్యం ట్రాఫిక్ కష్టాల్లో చిక్కుకుంటుంది. అలాంటి ఏరియాలో పార్కింగ్ కోసం ప్రజలు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. వాటన్నిటికీ పెట్టేందుకు ప్రభుత్వం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్‌లో తొలిసారి పార్కింగ్ కోసమే ఏకంగా 10 అంతస్తుల భవనం అందుబాటులోకి రానుంది. అది కూడా మరో రెండు నెలల్లోనే సిద్ధం కానుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. నాంపల్లి చౌరస్తాలోని మెట్రోకు ఉన్న అరెకరం స్థలంలో నిర్మిస్తున్న ఈ భవనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
మెస్సర్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ. 80 కోట్లతో దీనిని నిర్మిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే నాంపల్లి చుట్టుపక్కల వాహనదారులకు పార్కింగ్ కష్టాలు తీరుతాయి. మరీ ముఖ్యంగా నుమాయిష్ సమయంలో సందర్శకుల పార్కింగ్ కష్టాలకు చెక్ పడుతుంది
.