hyderabad

Hyderabad: దారుణం.. ప్రాణం తీసిన పార్కింగ్ గొడ‌వ‌.. నిందితుడు పరార్..!

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ విషయంలో జరిగిన చిన్నపాటి గొడవ ఒక్క సెకన్లలోనే ప్రాణాంతక సంఘటనగా మారింది. కొత్తపేటలోని వైష్ణవి రుతిక అపార్ట్‌మెంట్ వేదికగా ఈ ఘటన చోటుచేసుకుంది. మే 21న చోటు చేసుకున్న ఈ ఘటన, నిందితుడు పరారవడంతో అంతకంతకూ కొత్త కోణాలను సంతరించుకుంటోంది.

వివరాల్లోకి వెళితే…

ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కుటుంబంతో కలిసి గత 13 ఏళ్లుగా కొత్తపేటలోని వైష్ణవి రుతిక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ నెంబర్ 402లో అద్దెకు ఉంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ జివ్వాజి ఇటీవల వచ్చారు.

ఇది కూడా చదవండి: Kamal Haasan: సారీ చెప్పానన్న కమల్ హాసన్.. కర్ణాటక సినిమాలు బ్యాన్ చేస్తాం అన్న మంత్రి

ఆ రోజు కృష్ణ తన కారును అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో పార్క్ చేశాడు. నాగిరెడ్డి తిరిగి వచ్చి తన కారు కృష్ణ వాహనానికి వెనుక పార్క్ చేశారు. కొద్ది సేపటికి కృష్ణ కిందకు వచ్చి చూసే సరికి తన కారుపై స్క్రాచ్‌లు కనిపించాయి. దింతో ఆగ్రహించిన కృష్ణ, తానే  ఇలా చేశాడేమో అనే అనుమానంతో, వాచ్‌మన్ ద్వారా నాగిరెడ్డిని కిందికి పిలిపించి గొడవపడ్డాడు. చిన్నగా స్టార్ట్ అయిన గొడవ నెమ్మదిగా పెద్దగా మారి చివరి దెబ్బలు ఆదుకునే అంతవరకూ దారి తీసింది. కృష్ణ కొట్టడంతో కొద్దిసేపటికే నాగిరెడ్డి చెవి నుంచి రక్తం, నోటిలోంచి నురుగు రావడంతో అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు తక్షణమే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

నిందితుడు పరారీ, కుటుంబం విషాదంలో

ఈ సంఘటన జరిగిన అదే రాత్రి మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, అప్పటికే నిందితుడు కృష్ణ జివ్వాజి పారిపోయాడు. కామాక్షి కూడా ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిపోయింది. ఘటనపై అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు చనిపోయినంతటి నిందితుడిని అరెస్ట్ చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా మీడియాతో ఈ విషయాన్ని అధికారికంగా చెప్పనందుకు, పోలీసుల నిర్వీర్యతపై అనేక విమర్శలు వస్తున్నాయి.

పార్కింగ్ గొడవ… ప్రాణం పోయే దారితీసిందా?

పోస్టుమార్టం అనంతరం నాగిరెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. గండ్ర నాగిరెడ్డిని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి మధ్య వీడ్కోలు పలికారు. చిన్నపాటి పార్కింగ్ వివాదం ఒక కుటుంబాన్ని నాశనం చేయడమే కాకుండా, సమాజానికి కూడా చేదు గుర్తుగా మిగిలింది.

చివరగా…

ఒక కారును ఎక్కడ పార్క్ చేశామన్న చిన్న వివాదం ఎంత పెద్ద విషాదంగా మారుతుందో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చాటిచెబుతోంది. చిన్న చిన్న గొడవలను సంయమనం, మాటల ద్వారానే పరిష్కరించుకోవడం అవసరం. ప్రతిసారీ హింసకు దారి తీస్తే, దాని ఫలితాలు ఎప్పటికీ పూడ్చలేనివే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *