Panchayat Elections: స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై ఈ రోజు (నవంబర్ 24) తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యంపై నిలదీసింది. ఇతర కారణాలను పక్కనబెట్టి అయినా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది.
Panchayat Elections: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? అని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు విచారణ సమయంలో ప్రశ్నించింది. ఈ నెల (నవంబర్) 24వ తేదీలోగా ఎన్నికల తేదీలను ప్రకటించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-ఈ ప్రకారం పంచాయతీల కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నదని గుర్తుచేసింది.
Panchayat Elections: తాము బీసీ రిజర్వేషన్లపై మాత్రమే అభ్యంతరాలు వ్యక్తంచేశామని, ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అభ్యంతరాలు తెలుపలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్ గ్రామాలను పక్కనబెట్టి మిగతా గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ తెలపగా, అలా విభజించి నిర్వహించడం సరికాదని హైకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది.
Panchayat Elections: ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడినట్టయింది. వాస్తవంగా రాష్ట్రప్రభుత్వం పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు కసరత్తును మొదలుపెట్టింది. ఇప్పటికే పంచాయతీలు, వార్డు స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. వాటి గెజిట్లు జిల్లాల వారీగా ఈ రోజు (నవంబర్ 24) పంచాయతీరాజ్ శాఖకు చేరనున్నాయి. దీంతో వాటి ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌కు వెళ్లనున్నది.
Panchayat Elections: నవంబర్ 25న క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకొని, అదే రోజు కానీ, మరునాడైన 26న కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రచారం జరిగింది. ఈ లోగా హైకోర్టు మాత్రం నవంబర్ 24వ తేదీనే ఎన్నికల నిర్వహణపై తేల్చి చెప్పాలని ఆదేశించడంతో కొంత ఇరకాడంలో పడినట్టయింది.
