Akhanda 2: నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2 తాండవం’తో మళ్లీ స్క్రీన్‌పై దండయాత్ర చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ 2 తాండవం’ భారీ అంచనాలు నింపుతోంది. దర్శకుడు బోయపాటి శ్రీను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. మేకర్స్ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా చేపట్టనున్నారు. ముంబై, చెన్నైతోపాటు ఉత్తర భారతంలోని ముఖ్య నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించే ప్లాన్ ఉంది. ఈ ప్లాన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. బాలకృష్ణ మాస్ యాక్షన్ అవతారంతో థియేటర్లలో తాండవం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. అభిమానులకు కిక్ ఇచ్చేలా ఈ ప్రమోషన్స్ ఉంటాయని సమాచారం. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

