Palasa: తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన పలాస చిత్రం 2020 మార్చి 6న విడుదలైంది. ఈ యేడాదితో అది ఐదేళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా ద్వారనే కరుణకుమార్ దర్శకుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ‘మెట్రో కథలు’ వెబ్ సీరిస్ తో పాటు ‘శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం, మట్కా’ చిత్రాలను కరుణ కుమార్ తెరకెక్కించాడు. అంతేకాదు… ఈ అయిదేళ్ళలో కరుణ కుమార్ కొన్ని చిత్రాలలో కీలకమైన పాత్రలను సైతం పోషించాడు. బేసికల్ గా మంచి రచయిత అయిన కరుణ కుమార్ తన తొలి చిత్రం ‘పలాస’ను మార్చి 6న మరోసారి జనం ముందుకు తీసుకురాబోతున్నారు. రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్దన్, లక్ష్మణ్ మీసాల, శ్రుతీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘పలాస’ మ్యూజికల్ హిట్ గానూ నిలిచింది.
