Pak-Saudi Deal

Pak-Saudi Deal: పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య బిగ్ డీల్

Pak-Saudi Deal: పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఒక చారిత్రాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, ఒక దేశంపై జరిగిన దాడిని మరొక దేశంపై జరిగిన దాడిగా పరిగణించి, ఇద్దరూ కలిసే శత్రువుపై పోరాడతారు.ఈ ఒప్పందంలోని ప్రధాన నిబంధన ఇదే. దీని ప్రకారం, పాకిస్తాన్ లేదా సౌదీ అరేబియాపై ఎవరైనా దాడి చేస్తే, దాన్ని ఇద్దరిపైనా జరిగిన దాడిగా పరిగణిస్తారు. అప్పుడు ఇరు దేశాలు కలిసి శత్రు దేశంతో సైనిక పరంగా పోరాడతాయి. ఈ ఒప్పందం ఇరు దేశాల రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, ఏదైనా దాడిని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఒక వ్యూహాత్మక మార్గాన్ని నిర్దేశిస్తుంది.

ఇది కూడా చదవండి: AP Assembly: బొత్స Vs అచ్చెన్న.. మండలిలో మంటలు

ఈ ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించింది. తాము ఈ ఒప్పందం వల్ల కలిగే పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. భారత జాతీయ భద్రత, ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ పరిణామాల ప్రభావాలను మేము అధ్యయనం చేస్తాము. జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి, అన్ని రంగాలలో సమగ్ర జాతీయ భద్రతను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్ వంటి అంశాల మధ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కుదిరింది. భారత ప్రభుత్వం ఈ కొత్త వ్యూహాత్మక కూటమి వల్ల తమ భద్రతకు ఏమైనా సవాళ్లు ఎదురవుతాయా అని అంచనా వేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారత్‌కు కూడా సౌదీ అరేబియాతో మంచి ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *