Pakistan: రెండు నెలల ఆహారం.. నిల్వచేసుకోండి పాక్‌ ప్రజలకు అలర్ట్‌.. 

Pakistan: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కశ్మీర్‌ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను (PoK) పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆహారం నిల్వ చేసుకోవాలంటూ స్థానికులను పీఓకే యంత్రాంగం అప్రమత్తం చేసింది. రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశాం, అని చౌధ్రీ అన్వర్ ఉల్‌హక్‌ స్థానిక అసెంబ్లీలో శుక్రవారం వెల్లడించారు.

అలాగే స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఆహారం, ఔషధాలు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు ఉల్‌హక్ తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే దొంగదెబ్బతో పీఓకేను తన నియంత్రణలోకి తీసుకున్న పాకిస్థాన్‌- ఆ ప్రాంత అభివృద్ధిని గాలికొదిలేసింది. ఇండియాపై విద్రోహచర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే పీఓకేను పాక్‌ చూస్తోంది. పీఓకే ప్రధానమంత్రి పీఠం అధిరోహించినవారు ఇస్లామాబాద్‌ సర్కారు చేతుల్లో కీలుబొమ్మగానే మిగిలిపోతున్నారు.

ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ కరవవుతోంది. దివాళ అంచున ఉన్న పాకిస్థాన్‌ను స్థానిక తిరుగుబాట్లు, వరుస ఉగ్రదాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భారత్‌ అనుకూలవాదం వినిపిస్తోంది. కాగా, భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ ఇటీవల మాట్లాడుతూ.. కశ్మీర్‌ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. ఉగ్రవాదులను శిక్షించడానికి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. భారత్‌ కఠినంగా జవాబివ్వాలని కోరారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి చాలా క్రూరమైనదని ఆవేదన వ్యక్తంచేశారు. కశ్మీర్‌ వివాదంలో ఈ ఘటనే చివరిది కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  NTR-Neel: ఎన్టీఆర్ చిత్రంలోనూ నీల్ మదర్ సెంటిమెంట్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *