IND vs PAK: బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 కోసం టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ ఈ కొత్త జెర్సీలతో ఫొటోలు దిగారు. ఈ జెర్సీపై ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025, పాకిస్థాన్’ అని ముద్రించడం విశేషంగా మారింది. ఐసీసీ అవార్డులు అందుకనే కార్యక్రమానికి హాజరైన భారత ప్లేయర్లు అప్పుడు ఈ జెస్సిని ధరించారు. ఆ వివరాల్లోకి వెళితే…
సాధారణంగా ఐసీసీ టోర్నీల్లో ఆతిథ్య దేశ పేరును జెర్సీలపై ముద్రించడం పరిపాటిగా వుంటుంది. కానీ బీసీసీఐ ఈ సారి పాకిస్థాన్ పేరును ముద్రించడానికి నిరాకరించింది అని వార్తలు వచ్చాయి. పాకిస్థాన్‌లో ఆడటం లేదని చెప్పి, వారి పేరును ముద్రించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, ఐసీసీ జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం పరిష్కారమైంది పైగా బీసీసీఐ ప్రతినిధి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరించాడు.
Also Read: Cancer Vaccine: క్యాన్సర్ తో బాధపడే మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. వ్యాక్సిన్ పై మంత్రి ఏమన్నారంటే..
దాంతో బీసీసీఐ తాజాగా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించారు. ఈ జెర్సీలో మన ఆటగాళ్లు ఐసీసీ అవార్డులు అందుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.
రోహిత్ శర్మ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు, జడేజా టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందాడు. హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ కూడా టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకున్నారు. అలాగే, అర్షదీప్ సింగ్ మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా మరియు పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 23న జరగబోతోంది.