PAK vs SL: ఆసియా కప్ 2025లో సూపర్ 4 దశ ఉత్కంఠగా మారింది. పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగిన కీలక మ్యాచ్ తర్వాత ఫైనల్‌కు చేరుకునే రేసు మరింత ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించడం వల్ల ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.. శ్రీలంక తమ రెండు సూపర్ 4 మ్యాచ్‌లలో ఓడిపోయింది. దీంతో వారు ఫైనల్ రేసు నుండి నిష్క్రమించారు. పాకిస్తాన్ ఒక ఓటమి, ఒక గెలుపుతో రెండు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. వారికి ఇప్పుడు ఫైనల్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఫైనల్‌కు అర్హత సాధించడానికి మూడు జట్లు (భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్) పోటీ పడుతున్నాయి. భారత్ తమ మొదటి సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్నందున, మిగిలిన మ్యాచ్‌లలో ఒక విజయం సాధించినా లేదా ఇతరుల ఫలితాలను బట్టి భారత్ ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం.
ఇది కూడా చదవండి:Arshdeep Singh: పాకిస్తాన్ క్రికెటర్‌కు అర్ష్‌దీప్ సింగ్ కౌంటర్.. వీడియో వైరల్
పాకిస్తాన్‌కు ఫైనల్‌కు వెళ్లాలంటే, తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై తప్పనిసరిగా గెలవాలి. ఆ మ్యాచ్ గెలిచి నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకుంటేనే ఫైనల్‌కు వెళ్లగలరు. బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించి మంచి ఆరంభం పొందింది. వారికి ఇంకా భారత్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఫైనల్‌కు చేరుకోవాలంటే వారు కనీసం ఒక మ్యాచ్ గెలవాలి, లేదా మెరుగైన నెట్ రన్ రేట్‌తో ముందుకు సాగాలి.