Pahalgam Terror Attack:పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ఆర్మీ దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో ముందుకే సాగుతున్నాయి. ఇదే సమయంలో అలికిడి కలిగిన చోటల్లా జల్లెడ పడుతున్నది. ఇదే సమయంలో భారత్ ఆర్మీకి తారసపడిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని హతం చేసింది. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నాడన్న సమాచారంతో పుల్వామా జిల్లా త్రాల్‌కు చెందిన ఉగ్రవాది ఆసిఫ్‌ఖాన్ ఇంటిని ఆర్మీ పేల్చివేసింది. ఆ తర్వాత లల్లీని హతమార్చింది.
Pahalgam Terror Attack:పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరుల కోసం గాలిస్తుండగా బందిపొరా జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నది. ఈ సందర్భంగానే భారత్ ఆర్మీకి, లష్కరే ముష్కరులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో లష్కరే టాప్ కమాండర్ అయిన అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయని తెలుస్తన్నది. ప్రస్తుం అక్కడ ఇంకా ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
Pahalgam Terror Attack:ఇదిలా ఉండగా, భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్ము కశ్మీర్ వెళ్లనున్నారు. శ్రీనగర్, ఉదమ్‌పూర్‌లో ఆయన పర్యటించనున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశం అవుతారు. సరిహద్దుల వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆరా తీయనున్నారు. చేపట్టాల్సిన చర్యలపై ద్వివేది వారికి దిశానిర్దేశం చేయనున్నారు.