Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. పర్యాటకులను కొండలపై తిప్పుతూ ఆహ్లాదాన్ని పంచుతూ ఉపాధి పొందే ఓ యువకుడు కూడా ఆ ఉగ్రవాదులు దాడిలో అసువులు బాశాడు. అతని మృతితో ఉగ్రవాదులకు మతం, కులం, భాషాభేదాలు ఉండవని రుజువైంది. మానవత్వం మరిచి మనుషులను చంపడమే వారు తమ లక్ష్యంగా పెట్టుకుంటారని తేలింది.
Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్‌కు చెందిన సయ్యద్ హుస్సేన్‌షా హార్స్ రైడర్. పహల్గాం ప్రాంతంలో గుర్రం తోలుతూ ఇంటిని పోషించుకుంటున్నాడు. పర్యాటకులపై దాడికి దిగిన సమయంలో ఉగ్రవాదులను హుస్సేన్‌షా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఉగ్రవాదుల చేతిలో నుంచి తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. కానీ, మానవత్వమే లేని ఆ దుండగులు హుస్సేన్‌షాను కాల్చి చంపేశారు.
Pahalgam Terror Attack: గుర్రంతోలుతూ ఇంటిని పోషించి తన కొడుకును ఆ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారని హుస్సేన్‌షా తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే అందరినీ కంటతడి పట్టించింది. పర్యాటకులను రక్షించడానికి ఉగ్రవాదులతో హార్స్ రైడర్ హుస్సేన్‌షా వీరోచితంగా పోరాడి చివరకు ఆ దుండగుల దాడిలో కన్నుమూశాడు.

