Pahalgam Attack: మా అన్నను నరికి చంపిన ఉగ్రవాది తల నరికి తెచ్చి మాకివ్వండి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్టు.. అని పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి ఆవేదన వ్యక్తంచేశారు. మీడియాతో ఆమె తీవ్రస్వరంతో మాట్లాడుతూ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో వచ్చి ఉంటే మా అన్న ప్రాణాలతో ఉండేవాడని ఆవేదన వ్యక్తంచేసింది.
Pahalgam Attack: ఉగ్రవాదుల కాల్పుల తర్వాత తన అన్న వినయ్ నర్వాల్ గంటన్నర పాటు బతికే ఉన్నారని అతని చెల్లి దుఃఖిస్తూ తెలిపారు. సెక్యూరిటీ నిర్లక్ష్యం వల్లే ప్రాణాలిడిచాడని ఆవేదన వ్యక్తంచేసింది. ఇదిలా ఉండగా, ఘటన జరగడానికి ఆరు రోజుల ముందే లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ వివాహం జరిగింది.
Pahalgam Attack: ఏప్రిల్ నెల 16న వినయ్ నర్వాల్‌కు, హిమాన్షితో వివాహం జరిగింది. వారి జంట హనీమూన్ కోసం పహల్గాం వచ్చారు. అక్కడ పచ్చిక బయలులో భార్యాభర్తలు ప్రకృతిలో విహరిస్తుండగా, ఈ ఉగ్రదాడి జరిగింది. ఆయన మృతితో వినయ్ నర్వాల్ కుటుంబంతోపాటు హిమాన్షి కుటుంబం కూడా దుఃఖసాగరంలో మునిగిపోయాయి.
