Padi kaushik: తెలంగాణ తెచ్చిన హీరో కేసీఆర్

Padi kaushik: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పీకర్ నిర్వహించిన విచారణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విచారణకు దానం నాగేందర్ రాలేదని, బీజేపీ కూడా హాజరుకాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ మరియు బీజేపీ ముందే కలిసిపోయాయని ఆరోపించారు. ఫిబ్రవరి 18న మళ్లీ విచారణకు రావాలని తనకు చెప్పారని తెలిపారు.

కరీంనగర్ సీపీ, జమ్మికుంట సీఐపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చామని చెప్పారు. తన ఊరిలో సమ్మక్క దర్శనానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారని ఆరోపించారు. అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

కేసీఆర్ గురించి మాట్లాడుతూ, తెలంగాణ తెచ్చిన హీరో కేసీఆర్ అని ప్రశంసించారు. ఎస్ఐటీ, జీఐటీ విచారణలకు కేసీఆర్ భయపడరని చెప్పారు. కేసీఆర్ ఎస్ఐటీ విచారణకు తప్పకుండా హాజరవుతారని కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *