AP Liquor Scam Case

AP Liquor Scam Case: దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న ఈడీ

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా మళ్లీ దుమారం రేపుతోంది. గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) హైదరాబాద్‌తో పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో  ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు.

అధికారుల తెలిపిన ప్రకారం, ఈ దర్యాప్తులో షెల్ కంపెనీలు, బినామీలు, హవాలా మార్గాల ద్వారా సుమారు రూ.3,500 కోట్ల నిధులను మళ్లించిన మనీలాండరింగ్ మధ్యవర్తులపై కచ్చితమైన ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ కేసులో రెండవ అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించినా, ఆయనను నిందితుడిగా పేర్కొనలేదు. అయితే, ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయంపై SIT సీరియస్‌గా విచారణ జరిపింది.

ఇది కూడా చదవండి: Uttarakhand: ఎంపీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం

2019 నుండి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (APSBCL) నుండి కాంట్రాక్టులు పొందడంలో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ.10,500 కోట్ల విలువైన కాంట్రాక్టుల కోసం 16 మద్యం కంపెనీలు దాదాపు రూ.1,677 కోట్ల లంచం చెల్లించారని SIT స్పష్టంగా పేర్కొంది.

ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టులు జరగగా, తాజా ఈడీ దర్యాప్తులు మరిన్ని షాకింగ్‌ విషయాలు వెలికితీయనున్నాయనే ఊహాగానాలు ఉన్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *