Malasia: మలేషియా దేశంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలకు మన తెలుగు కళాకారుడి డప్పు దరవు మోగనున్నది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ డప్పు కళాకారుడు, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి అప్పన్నపేటకు చెందిన అమరవరపు సతీశ్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు సతీశ్ ఆ వేడుకల్లో డప్పు దరపు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు సతీశ్ గురువారం మలేషియా బయలుదేరి వెళ్లారు.
