Osmania Hospital: హైదరాబాద్ నగరం నడిబొడ్డున వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి మరో చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నది. రాజుల కాలం నుంచి ఈనాటి ప్రజాస్వామిక పాలన దాకా కోట్లాది మంది నిరుపేదలు, ఇతర ప్రజలకు నిరంతర వైద్యసేవలు అందించింది. తెలంగాణకే కాదు.. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన దవాఖానగా గుర్తింపు పొందింది. ఉస్మానియా ఒక బ్రాండ్‌గా మారి ప్రత్యేకతను కూడా సంతరించుకున్నది. ఇప్పటికీ కిక్కిరిసిన జనంతో నిత్యం రద్దీగా ఉంటుంది.
Osmania Hospital: అలాంటి ఉస్మానియా ఆసుపత్రికి త్వరలో నూతన హంగులు సంతరించుకోనున్నాయి. జనవరి 31న గోషామహల్‌లోని పోలీస్ స్టేడియంలో ఉస్మానియా నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఆసుపత్రిని రూపొందించాలని ఇప్పటికే ప్లాన్ రూపొందించారు. ఆ మేరకు అత్యాధునికి హంగులతో నూతన భవనాలు నిర్మాణం జరగనున్నాయి.
ఉస్మానియాకు అత్యాధునిక హంగులు ఇవే..
* 26.30 ఎకరాల విస్తీర్ణం కొత్త భవనాల నిర్మాణం
* 2,000 పడకలతో ఆసుపత్రి భవనాల నిర్మాణం
* కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో 30 డిపార్ట్‌మెంట్‌లు
* వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మానియా ఆసుపత్రి
* స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు
* రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ చుట్టూ మార్చురీ
* అత్యాధునిక టెక్నాలజీతో మార్చురీ నిర్మాణం
* ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు
* అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
* ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ఆపరేషన్ థియేటర్లు
* ఆపరేషన్ థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు
* గ్రౌండ్ ఫ్లోర్‌లో అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు
* పేషెంట్ అటెండెంట్ కోసం ఆసుపత్రి ఆవరణలోనే ధర్మశాల
* నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీల ఏర్పాటు
* 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం ఏర్పాటు

