Oscars 2025: ఆస్కార్ కు ఇండియా నుండి అధికారికంగా ఎంపికైన ‘లా పతా లేడీస్’ కు మొదట్లోనే చుక్కెదురైంది. అయితే ఉత్తమ చిత్రం కేటగిరికి కొన్ని భారతీయ సినిమాలు డైరెక్ట్ గా అప్లయ్ చేశాయి. అలా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 323 చిత్రాల నుండి ఆస్కార్ బృందం 207 సినిమాలను షార్ట్ లిస్ట్ చేసింది. అందులో మొత్తం ఆరు భారతీయ చిత్రాలు ఉన్నాయి. వీటిలో సూర్య ‘కంగువా’, పృథ్వీరాజ్ ‘ఆడు కాలం’ తో పాటు హిందీ సినిమాలు ‘స్వతంత్ర్య వీర సావర్కర్’, ‘సంతోష్’, ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’, ‘ఆల్ వి ఇమాజిన్ ఏస్ లైట్’ చిత్రాలు ఉన్నాయి. అయితే… బాక్సాఫీస్ బరిలో బోల్తాపడ్డ ‘కంగువా’ను నిర్మాతలు ఏ ధైర్యంతో ఆస్కార్ కు పంపారో కదా! అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ నెల 8 నుండి 12 వరకూ ఈ సినిమాలకు సంబంధించిన ఆన్ లైన్ ఓటింగ్ జరుగుతుంది. జనవరి 17న ఇందులోని టాప్ టెన్ చిత్రాలను ఆస్కార్ కమిటీ ప్రకటిస్తుంది.