Transfers: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియకు శనివారం రాత్రి అధికారికంగా శ్రీకారం చుట్టింది. విభిన్న కేడర్లలో ఉన్న వైద్యులు, పారామెడికల్, మినిస్టీరియల్, ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు 2025 మే 31 నాటికి తమ ప్రస్తుతం ఉన్న పోస్టులో కనీసం రెండు సంవత్సరాలు సేవ చేసినవారై ఉండాలి. అయితే ఐదేళ్లు పూర్తిచేసినవారికి బదిలీ తప్పనిసరి. అంతేకాదు, ఏసీబీ లేదా విజిలెన్స్ కేసులలో చిక్కుకున్నవారికి అప్రాధాన్య ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వనున్నారు
మినిస్టీరియల్ సిబ్బంది బదిలీల విషయంలో, ఒకే కార్యాలయంలో మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు పనిచేస్తున్నవారిని అదే ప్రాంతంలోని ఇతర కార్యాలయాలకు బదిలీ చేయనున్నారు. ఐదేళ్లు దాటిన వారికి మాత్రం పోస్టు స్థాయిని బట్టి వేరే ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఈసారి బదిలీ కోరే ఉద్యోగులు ఐదు ఐచ్ఛిక కేంద్రాలు సూచించాల్సి ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రకారం, బదిలీ ప్రక్రియ 2025 మే 31 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరిగింది. దీనిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం జూన్ 19 వరకు ఈ ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది.
అయితే జూన్ 20 నుంచి బదిలీలపై నిషేధ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. అందుకే సంబంధిత అధికారులు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.