Operation Sindoor:పాకిస్థాన్ దేశంలో అంతర్భాగంగా ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదుల శిబిరాలను తుత్తునియలు చేసి ధైర్యసాహసాలు ప్రదర్శించి, శౌర్యప్రతాపం చూపిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. ఈ మేరకు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన ఆపరేషన్‌లో ఆర్మీ, వైమానిక దళాలకు చెందిన పలువురు అధికారులను ప్రతిష్ఠాత్మక వీర చక్ర పురస్కారంతో గౌరవించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Operation Sindoor:ఈ మేరకు 127 గ్యాలంట్రీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్రలు, 15 వీరచక్రలు, 16 శౌర్య చక్రలు ఉన్నాయి. భారత దేశ భద్రతపై సైనిక దళాలకు ఉన్న అంకితభావం, కార్యాచరణ నైపుణ్యాలను, నాయకత్వ పటిమకు నిదర్శనమని ఆ గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
Operation Sindoor:1988 మీడియం బ్యాటరీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్త్‌కు వీర చక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా రహస్యంగా, తక్కువ సమయంలోనే ప్రత్యేక పరికరాలను యుద్ధ విమానాల ద్వారా సమర్థంగా తరలించి, సైనిక సామర్థ్యాన్ని ప్రదర్వించిన 302 మీడియం రెజిమెంట్‌కు చెందిన కల్నల్ కోశాంక్ లాంబా తదితరులను కూడా ఈ పురస్కారం వరించింది.