Operation Sindoor: భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం దేశంలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులను భారత్ భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆ ముగ్గురూ లష్కరే తోయిబా సంస్థ ఉగ్రవాదులుగా గుర్తించిన సైన్యం వారి పేర్లను నాడు గుర్తించలేదు. తాజాగా మృతుల పేర్లను, ఫొటోలను భద్రతా దళాలు గుర్తించాయి.
Operation Sindoor: జమ్ముకశ్మీర్‌లోని నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కున్నార్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. వారిని చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని గుర్తించిన అధికారులు తాజాగా ఉగ్రవాదుల సమాచారాన్ని విడుదల చేశారు.
Operation Sindoor: నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో హతమైన ఉగ్రవాదులు యావర్ భట్, అమీర్ నాజిర్, ఆసీఫ్ షేక్‌గా గుర్తించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. వారి ఫొటోలను గుర్తించి విడుదల చేశారు. కాల్పుల విరమణ తర్వాత భారత్‌లో అలజడి సృష్టించాలని ఆ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని అధికారులు వెల్లడించారు. వారిని సైన్యం మట్టుబెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.