Operation Sindhu: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం తన ప్రజల రక్షణకు వేగంగా స్పందించింది. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య సైనిక చర్యల తీవ్రత నేపథ్యంలో అక్కడ ఉండే భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది.
ఇరాన్ నుంచి 1,117 మంది భారతీయుల తరలింపు
ఇరాన్ ప్రాంతంలో మౌలిక వసతులు దెబ్బతిన్నా, భారత ప్రభుత్వం తమ ఒప్పందాల ప్రకారం ఐదు ప్రత్యేక విమానాలను పంపింది. వీటి ద్వారా మొత్తం 1,117 మంది భారతీయులను విజయవంతంగా భారత్‌కు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో రాయబార కార్యాలయాలు కీలక పాత్ర పోషించాయి.
ఇజ్రాయెల్ గగనతలంపై ఆశాజ్యోతి
ఇజ్రాయెల్ గగనతలం కొద్ది రోజులుగా మూసివుండగా, తాజాగా గగనతలం తెరుచుకోవడం భారతీయుల తరలింపునకు మార్గం సుగమం చేసింది. ఇప్పటికే ఏర్పాటైన సాంకేతిక బృందాలు, ఎంబసీ సహాయంతో నేటి నుంచే భారతీయుల తరలింపు ప్రారంభమవుతోంది.
నేడు నుంచి ఇజ్రాయెల్ తరలింపు
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణికుల కోసం ప్రత్యేక విమానాలను నేటి నుంచి ప్రస్థానం చేయనున్నారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 3,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరిలో అత్యవసరంగా ఉన్నవారిని మొదట తరలించనున్నారు.
