Onion Price: మలక్‌పేట మార్కెట్‌కు మంగళవారం ఉల్లిగడ్డ పోటెత్తింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆశాజనకంగా ఉల్లి దిగుబడులు. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉల్లి దిగుమతి చేసుకున్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాలనుంచి కూడా ఉల్లి దిగుమతులు జరిగాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో క్వింటాలు ఉల్లి ధర రూ. 4 వేలు నుంచి 5500 పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.70 లకు వినియోగదారులకు అందుతోంది . ఉల్లి దిగుమతులు పెరుగుతుండడంతో బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు కాస్త తగ్గే అవకాశాలున్నాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి .
ఇది కూడా చదవండి: Dharmapuri aravind: కేటీఆర్ ను జైల్లో పడేయండి

