Ongole: మొంథా తుఫాన్ ప్రభావంతో ఒంగోలు పట్టణం తీవ్ర వర్షాలకు తడిసిముద్దైంది. భారీ వర్షాల కారణంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ, జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్‌లు వరద నీటతో మునిగిపోయాయి.
విద్యాసంస్థల ఆఫీస్ గదులు, తరగతి గదుల్లోకి నీరు చేరడంతో బోధన కార్యకలాపాలు నిలిచిపోయాయి. అధికారులు తక్షణ చర్యలు తీసుకొని స్థానిక విద్యార్థులను ఇళ్లకు పంపించారు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు క్యాంపస్‌లోనే ఉండిపోయారు.
అత్యవసరంగా మున్సిపల్ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు నీటిని తొలగించే పనులు చేపట్టాయి. వర్షాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగతోంది.

