OnePlus 13 : త్వరలో వన్​ప్లస్​ 13 లాంచ్​.. ఫీచర్స్, ధర ఇవే

ఎంతో పాపులర్ అయిన వన్ ప్లస్ సిరీస్ లో మరో మోడల్ మార్కెట్లోకి రాబోతోంది. వన్ ప్లస్ 12 మోడల్ కు కొనసాగింపుగా ఈనెలాఖరులో వన్ ప్లస్ 13 మొబైల్ చైనా మార్కెట్లలోకి అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 31న సాయంత్రం 4 గంటలకు మొబైల్ లాంచ్ కానుందని, అందుకు సంబంధించి వన్ ప్లస్ మొబైల్స్ తయారీ సంస్థ మోడల్ లాచింగ్ డేట్, డిజైన్, కలర్ పై అధికారికంగా ప్రకటించింది.

120 హెడ్జెస్ కలిగిన 6.82 ఇంచుల 2కే 10 బిట్ ఎల్టీ పీఓ బీఓఈ ఎక్స్2 మైక్రో క్వాడ్ కర్వ్ ఓఎల్ ఈడీ స్క్రీన్ తో మొబైల్ రూపొందింది. 24 జీబీ రామ్, 1 టీబీ వరకు డేటా స్టోరేజ్ కల్పించారు. సోనీ లైట్ 808 ప్రైమరీ సెన్సార్ తో కూడిన 50 మెగాపిక్సెల్స్ ట్రిపుల్ రేర్ కెమెరా ఉంది. అలాగే అల్ట్రావైడ్ యూనిట్ కలిగిన 50 మెగా పిక్సల్ యాంగిల్ యూనిట్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో కూడిన 50 మెగాపిక్సల్స్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ప్రాసెసర్ తో రూపొందించారు. ఎన్నో అధునాతన ఫీచర్లతో వస్తున్న వన్ ప్లస్ 13 మొబైర్ ధర దాదాపు రూ. 70 వేల వరకు ఉండొచ్చని అంచనా.

బ్యాటరీ, ఛార్లింగ్

6000 ఎంఏహెచ్ కలిగిన బ్యాటరీ, 100వాట్స్ కలిగిన ఫాస్ట్ చార్జింగ్ దీని ప్రత్యేకత. ఈ ఫోన్ కు వాటర్
360 వల్ల, దుమ్ము వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కలర్స్

వన్ ప్లస్ 13 మొబైల్ బ్లూ, బ్లాక్, వైట్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది. కొద్దిరోజుల తర్వాత బ్లూ కలర్లో డ్యుయల్ కలర్ అప్పియరెన్స్ రానుంది. అలగే వైట్ కలర్లో కెమెరా ఐలాండ్ ను రూపొందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *