One Nation One Election Bill: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ సమయంలో జరిగిన ఓటింగ్‌లో 20 మంది బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. ముందుగానే ఈ సమావేశాల్లో తప్పక హాజరవ్వాల్సిందిగా బీజేపీ ఎంపీలందరికీ త్రీలైన్ విప్ జారీ చేసింది. ఈ విప్‌ను కాదని నిన్న జరిగిన ఓటింగ్‌కు 20 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. కీలక సమయంలో హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అగ్రనేతలు సీరియస్‌గా ఉన్నారని తెలిసింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న అభిప్రాయంతోనే వారున్నట్టు అర్థమవుతున్నది.
One Nation One Election Bill: గైర్హాజరు అయిన 20 మంది ఎంపీలకు నోటీసులు ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. అయితే వారి గైర్హాజరు అంశంపై ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎంపీలు ఎందుకు హాజరు కాలేదన్న విషయంపై ఆరాతీయగా, కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. వివిధ వ్యక్తిగత, పనిసంబంధ కారణాల వల్ల తాము సభకు హాజరుకాలేమని ముందుగానే పార్టీకి సమాచారం ఇచ్చారని తెలిసింది. అయినా ఆ పార్టీ పెద్దలు గుర్రుగానే ఉన్నారని తెలుస్తున్నది. మరి నోటీసుల అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.


