NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తన లేటెస్ట్ సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.రీసెంట్ టీజర్ తో ఈ సినిమా పై సాలిడ్ బజ్ నెలకొనగా ఈ చిత్రాన్ని వేసవి రేస్ లోనే మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే కళ్యాణ్ రామ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ వచ్చి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఈవెంట్ కి కూడా అన్న కోసం తారక్ వస్తాడని తెలుస్తుంది. ఈసారి ఈవెంట్ ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
