Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: ఫ్యాన్స్ ని మళ్లీ నిరాశపరిచిన వీరమల్లు!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలిసిందే. చాలా కాలంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే, మార్చ్ 28 నాటికి థియేటర్లలో సందడి చేసి ఉండేది. కానీ, పవన్ డేట్స్ లభ్యం కాకపోవడంతో సినిమా వాయిదా పడింది.

ఇది కూడా చదవండి: Jagga Reddy: జ‌గ్గారెడ్డి సినిమా ఆఫీస్ ఉగాది శుభారంభం!

రీసెంట్‌గా బ్యాలన్స్ షూట్‌ను మళ్లీ ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. పవన్ కూడా త్వరలో జాయిన్ అవుతారని రూమర్స్ షికారు చేశాయి. కానీ, ఈ వార్తల్లో నిజం లేదని తాజా సమాచారం. పవన్ ఇప్పట్లో షూటింగ్‌కు వెళ్లే ఛాన్స్ లేదట. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన కొంతకాలం అందుబాటులో ఉండకపోవచ్చని టాక్. దీంతో సెట్స్‌పై అడుగుపెట్టే ఆలోచన కూడా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో “హరిహర వీరమల్లు”పై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. అభిమానులు ఎంతగా ఎదురుచూసినా, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందన్న దానిపై క్లారిటీ లేకుండా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *