Pradeep Kumar: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వ్యక్తి 7 ఏళ్ల తర్వాత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ వ్యక్తి నియామకం సామాన్యమైనది కాదు. ఎందుకంటే, ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై చాలా సంవత్సరాలు కోర్టులో ఆయన పోరాడారు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ప్రదీప్ కుమార్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
అలహాబాద్ హైకోర్టు ఇటీవల ప్రదీప్ కుమార్‌ను హెచ్‌జెఎస్ క్యాడర్ న్యాయమూర్తిగా నియమించాలని ఆదేశించింది, పిటిషనర్ ప్రదీప్ కుమార్ 2002 సంవత్సరంలో పాకిస్తాన్ గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 2014లో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2016లో, అతను నిర్దోషిగా విడుదలైన రెండేళ్ల తర్వాత, అతను UP హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై 27వ ర్యాంక్ సాధించాడు, కానీ నియామకం కాలేదు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు.. ఆ వ్యాఖ్యలే కారణం
Pradeep Kumar: ప్రదీప్ కుమార్ 2002లో పాకిస్థాన్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అప్పటికి ప్రదీప్ వయస్సు 24 సంవత్సరాలు. న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్. ప్రదీప్‌పై దేశద్రోహం, నేరపూరిత కుట్ర, అధికారిక రహస్యాల చట్టంలోని పలు నిబంధనలపై ఆరోపణలు వచ్చాయి. 2014లో కాన్పూర్ కోర్టు అతడిని ఈ కేసుల్లో నిర్దోషిగా విడుదల చేసింది, అయితే ఈ కేసుల్లో అతను కొన్ని రోజుల పాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది.