OG: పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు 27, 2025న ప్రారంభమైన టికెట్ అమ్మకాలు కేవలం 24 గంటల్లోనే $82K వసూలు చేసి, $200K, $250K మార్కులను వేగంగా అధిగమించింది.తాజాగా $300K దాటి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. కేవలం నాలుగు వారాల ముందే ఈ ఘనత సాధించడం విశేషం. 46 షోల నుంచి 2.8K టికెట్లు అమ్ముడవ్వగా, స్టాండర్డ్ షోలకు $25, XD/PLF షోలకు $30 ధర నిర్ణయించారు. ఈ వేగంతో పోతే, ఇండియన్ సినిమాల్లో అత్యధిక ప్రీమియర్ సేల్స్ రికార్డు (RRR, కల్కి 2898 AD, పుష్ప 2)ని బద్దలు కొట్టే అవకాశం ఉంది.
