OG: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, టాలీవుడ్‌ను పైరసీ భయం వెంటాడుతోంది. ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) ‘ఓజీ కమింగ్ సూన్’ అంటూ తమ సైట్‌లో ఒక పోస్టర్ షేర్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ పోస్టర్ సినిమాను లీక్ చేస్తామంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లుగా ఉంది.
ఐబొమ్మ వెబ్‌సైట్ చరిత్రలో కొత్త మలుపు
వాస్తవానికి, ఐబొమ్మ వెబ్‌సైట్ ఇదివరకు ఓటీటీలో విడుదలైన సినిమాలను మాత్రమే పైరసీ చేసేది. కానీ, ఇప్పుడు కొత్తగా థియేటర్లలో విడుదలైన సినిమాల హెచ్‌డీ ప్రింట్‌లను కూడా తమ సైట్‌లో పెడుతోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్ సినిమాను కూడా టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సినిమా పరిశ్రమకు పెను సవాల్
‘ఓజీ’ లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఇలా విడుదలకు ముందే పైరసీ ముప్పు పొంచి ఉండటం చిత్ర యూనిట్‌కు, అభిమానులకు పెద్ద షాక్. ఈ పరిణామం బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని సినీ పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ పడనున్న నేపథ్యంలో, ఈ పైరసీ హెచ్చరికపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.