Peddapalli: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో రోడ్ల వెడల్పు, అభివృద్ధి లో మళ్లీ కూల్చివేతరు ప్రారంభించారు. ఈ క్రమంలోనే పట్టణ చౌరస్తా వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అభివృద్ధి పేరుట చిరు వ్యాపారులను రోడ్లపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి వ్యాపారులు జీవనోపాధి కోల్పోతున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: అరగంట మోరాయించిన హైదరాబాద్ మెట్రో
ఇప్పటికే సుమారు 100 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. నష్టపోయిన వ్యాపారులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ విషయంలో పార్టీ కార్యాలయాలు గాని నివాసాలకు గాని నోటీసులు ఇచ్చి కూల్చి వేస్తున్నామని సింగరేణి అధికారి వీరారెడ్డి అన్నారు. రోడ్ల వెడల్పులో భాగంగా కూల్చివేతలు ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

