Globetrotter: సూపర్ స్టార్ మహేశ్ బాబు – రాజమౌళి SSMB29 టైటిల్ ‘గ్లోబ్ ట్రాటర్’గా ఖరారైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ మరికాసేపట్లో సరిగ్గా 5:30 గంటలకు జరగనుంది. వేలాది మంది అభిమానులు హాజరుకానున్నారు. ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి.
Also Read: Janhvi Kapoor: జాన్వీకి టాలీవుడ్‌నే సరైన ప్లాట్‌ఫామ్.. దర్శకుడు బోల్డ్ కామెంట్?
ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న SSMB29 టైటిల్ అధికారికంగా ‘గ్లోబ్ ట్రాటర్’గా ఆవిష్కృతమైంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్‌లో టైటిల్ పోస్టర్, గ్లింప్స్ వీడియో రిలీజ్ కానున్నాయి. ప్రియంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఘట్టమనేని అభిమానులు రామోజీకి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో 5:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు ఫస్ట్ లుక్‌ను రాజమౌళి ఎలా ప్రజెంట్ చేస్తారన్న ఉత్కంఠ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ సంచలనం సృష్టించడం ఖాయం.
