Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చిరకాల స్వప్న ప్రాజెక్ట్ ‘మహాభారతం’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ భారీ చిత్రంలో ప్రముఖ నటులు నాని నటిస్తున్నట్లు రాజమౌళి స్వయంగా అధికారికంగా ప్రకటించారు. నాని మాత్రమే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌లో భాగమని, మిగతా తారాగణం వివరాలు త్వరలో వెల్లడవుతాయని తెలిపారు. ‘మహాభారతం’ను అత్యంత భారీ స్థాయిలో, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందేలా రూపొందించాలన్నది రాజమౌళి లక్ష్యం.
Also Read: Nani : SSMB29 రిలీజ్ డేట్‌పై నాని క్లారిటీ!
Rajamouli: గతంలో ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి, ఈసారి ‘మహాభారతం’ ద్వారా మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ నిర్మాణ విలువలతో రానుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి మరోసారి తనదైన మార్క్ సినిమాటిక్ అనుభవంతో అద్భుతాలు సృష్టించనున్నారని అంచనాలు నెలకొన్నాయి!