Odisha: ఆ ఊరిలో వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంత్యక్రియలు చేసి పూడ్చిపెట్టిన శవాలు కొన్నిరోజులకే మాయం అవుతున్నాయి. ఆ ఘటనలతో ఊరంతా భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 2017 నుంచి ఈ ఘటనల చోటుచేసుకుంటున్న ఈ ఘటనలతో ఇప్పటి వరకు 15 మృతదేహాలు కనిపించకుండా పోయాయని గుర్తించారు. ఇంకా గుర్తించనివి ఇంకా చాలా ఉండొచ్చని భావిస్తున్నారు.
Odisha: ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలోని మణినాథ్‌పూర్ గ్రామంలోని శ్మశానవాటికలో ఈ వింత సంఘటనలు జరుగుతున్నాయి. పూడ్చిపెట్టిన కొన్నాళ్లకే తమ వారి మృతదేహాలు కనిపించకుండా పోయాయని వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. వారిలో లక్ష్మీప్రియ, బెహెరా, సత్యభామ, పరిడా, శత్రుఘ్న దాస్, ప్రమీలా దాస్ మృతదేహాలు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
Odisha: ఈ సంఘటనల వెనుక ఏ శక్తులు ఉన్నాయనే దానిపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతబడుల కోసం శవాలను మాయం చేస్తున్నారా? అన్న అనుమానంతో ఆందోళన చెందుతున్నారు. లేదా అక్రమంగా అవయవాలను సేకరించి, ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ముఠా ప్రమేయం ఉండవచ్చా? అని కూడా గ్రామంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Odisha: ఇంతకుముందు కూడా ఇలాంటి పలు ఫిర్యాదులు గ్రామస్థుల నుంచి వచ్చిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఓ కమిటీని వేసి సమగ్ర విచారణ జరపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. శ్మశానవాటికిలో ఖననం చేసిన 10 రోజుల తర్వాత తన తల్లి మృతదేహం కనిపించ లేదని, ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తపస్ సమల్ అనే యువకుడు తెలిపారు.
Odisha: ఇటీవలే నాలుగు మృతదేహాలు కనిపించకుండా పోయాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనలు ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాత్రి వేళల్లో ఆ శ్మశానవాటిక వైపు వెళ్లడానికి గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అందుకే ఎవరూ కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు తెలిపారు.

