Odisha: అధికారం మాది.. మేము చెప్పినట్టు ఎందుకు వినవు.. మమ్మల్ని కాదని నువ్వు ఉద్యోగం ఎట్లా చేస్తావు.. అని బెదిరిస్తూ.. కార్యాలయం నుంచి అదనపు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను బయటకు ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. దాడి చేసింది బీజేపీ కార్పొరేటర్, ఆ పార్టీ కార్యకర్తలు.
Odisha: ఒడిశా రాష్ట్రంలోని రాజధాని నగరమైన మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రత్నాకర్ సాహు తాము కోరిన పని చేయలేదనే కారణంతో బీజేపీ కార్పొరేటర్ జీవన్ రౌత్ ఆగ్రహంతో ఉన్నారు. ఆయన బీజేపీ కార్యకర్తలతో స్వయంగా కార్పొరేషన్ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ చాంబర్‌లో ఉన్న కమిషనర్ రత్నాకర్ సాహును బయటకు రప్పించారు. ప్రధాన గేటు వద్ద పిడిగుద్దులు గుద్దుతూ, కింద పడిపోతే తన్నుకుంటూ, ఈడ్చుకుంటూ దారుణంగా దాడి చేశారు.