Odela 2: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న సినిమా “ఓదెల 2”. గతంలో ఓటీటీలో విడుదలయ్యి హిట్ సాధించిన సినిమా ఓదెల కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో తమన్నా అఘోరీగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మేకర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారు.మహా కుంభమేళాలో సినిమా టీజర్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 22న టీజర్ ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి అక్కడ రిలీజ్ చేసే టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మేకర్స్ రిలీజ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

