Odela 2 : టాలీవుడ్‌లో లేటెస్ట్ సంచలనం ‘ఓదెల 2’! ‘ఓదెల రైల్వే స్టేషన్’ సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు అశోక్ తేజ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, స్టార్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా లీడ్ రోల్‌లో కనిపించనుంది.
ఆమె శివశక్తి అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఆకట్టుకోనుందట. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. అంతేకాదు, ఈ సినిమాకు భారీ డిజిటల్ డీల్ కుదిరింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపు రూ.18 కోట్లకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ డీల్ కోసం చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Also Read: Lenin: లెనిన్‌తో అఖిల్ హిట్ కొట్టేనా? డీగ్లామ్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా?
Odela 2 : థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్‌తో ఈ సినిమా ఇప్పటికే మంచి లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట సింహా, మురళీ శర్మ లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి బీజీఎం, పాటలు సమకూరుస్తుండగా, డి.మధు, సంపత్ నంది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఓదెల 2’ టాలీవుడ్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి!
ఓదెల 2 ట్రైలర్ ఇక్కడ చూడండి :