Black Magic

Black Magic: ఎన్టీఆర్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..

Black Magic: ప్రస్తుత ఆధునిక కాలంలో మానవుడు భూమి నుంచి ఆకాశానికి చేరుకునేంత టెక్నాలజీని కనుగొన్నాడు. కానీ కొందరు మాత్రం మూఢ నమ్మకాల పేరుతో చంపుకు చస్తున్నారు. చేతబడి, క్షుద్రపూజలు వంటి మూఢ నమ్మకాలతో బతుకుతున్నారు. వ్యాపారం బాగా జరగాలని జంతువులను బలిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిపై పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా కనీసం చైతన్యం రావడం లేదు.

తాజాగా అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన సంఘటన జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. వ్యాపార అభివృద్ధి జరగాలని పేపర్‌పై రాసి క్షుద్ర పూజలు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు.

Black Magic:  అదే సమయంలో నాగరాజు అనే వ్యక్తి తన 3 మేకలు కనిపించపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగానే మేకల కోసం వెతుకుతుండగా తన మేకలే బలిచ్చినట్లు నాగరాజు గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్షుద్ర పూజలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *