NZ vs IND Test Series: న్యూజీలాండ్ తో జరిగే రెండు, మూడో టెస్టు మ్యాచ్ లకు తమిళనాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేశారు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన సుందర్ 152 పరుగులు భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండు వికెట్లు కూడా తీసిన సుందర్ పై బోర్డు నమ్మకముంచింది. కివీస్ తో జరిగే మిగతా రెండు టెస్టుల కోసం అతన్ని జట్టులో చేర్చింది.
NZ vs IND Test Series: బెంగళూరు టెస్టులో ఆతిథ్య భారత జట్టుపై కివీస్ చారిత్రక విజయం సాధించిన తీరు సెలెక్టర్లను ఆలోచనలో పడేసింది. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే ఆలౌటవడం, అనుకూల వాతావరణంలోనూ బౌలింగ్ విభాగం రెండు ఇన్నింగ్స్ లలో విఫలమవడం ఒకింత కలవరానికి గురిచేసింది. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్.. అశ్విన్ పై నమ్మకముంచినట్లు కనిపించలేదు. అంత మాత్రాన సుందర్ ఎంపికను ప్లేయింగ్ లెవెన్ లో అతనుంటాడన్నట్లుగా భావించాల్సిన పనిలేదు.
NZ vs IND Test Series: ఆస్ట్రేలియా తో జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్ ప్రణాళికల్లో సుందర్ ఉంటాడని అతని ఎంపిక చెప్పకనే చెప్పింది. అతన్ని ఇండియా – ఎ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదేనేమో. గత బోర్డర్-గవాస్కర్ సిరీస్లో అశ్విన్ గాయపడిన పరిస్థితుల్లో సుందర్ కు అవకాశమిచ్చారు సెలెక్టర్లు. గబ్బాలో జరిగిన సిరీస్ డిసైడర్లో వాషింగ్టన్ సుందర్ ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 62, 22 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 4 వికెట్లు కూడా తీసి జట్టు విజయంలో, సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నవంబర్ 22 నుంచి పెర్త్ టెస్టులో ఆసీస్ సిరీస్ మొదలవుతుంది.