Nude Video Call:

Nude Video Call: న్యూడ్‌కాల్ ఉచ్చులో మ‌రో అధికార పార్టీ ఎమ్మెల్యే

Nude Video Call:గ‌తేడాది అక్టోబ‌ర్‌లో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌కు చెందిన ఎమ్మెల్యేకు న్యూడ్‌కాల్ వ్య‌వ‌హారం సంచ‌ల‌నం రేపింది. మ‌ళ్లీ తాజాగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో అధికార పార్టీకి చెందిన మ‌రో ఎమ్మెల్యేకు ఇదే త‌ర‌హా వీడియో కాల్ రావ‌డం క‌ల‌క‌లం రేపుతున్న‌ది. న్యూడ్ కాల్ చేసి, అస‌భ్య‌క‌రంగా మాట్లాడిన ఘ‌ట‌న‌లు త‌ర‌చూ చోటుచేసుకుంటున్నా ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకే రావ‌డం తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. ఈ విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Nude Video Call:క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యేకు గ‌తంలో వ‌చ్చిన‌ వీడియో కాల్ ఎత్త‌గానే అవ‌త‌లి నుంచి మ‌హిళ ఏకంగా న‌గ్నంగా ఉండ‌టంతో అవాక్క‌వ‌డం ఆయ‌న వంత‌యింది. వెంట‌నే ఆ కాల్‌ను క‌ట్ చేసి, ఆ జిల్లా మంత్రికి, పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మ‌హిళ ఎవ‌రు? ఏదైనా కుట్ర‌దాగి ఉన్న‌దా? అనే విష‌యాల‌పై ద‌ర్యాప్తు చేశారు. కానీ, ఆ విష‌యం మ‌రుగున‌ప‌డింది. ఏమైందో ఇప్ప‌టికీ తెలియ‌రాలేదు.

Nude Video Call:మళ్లీ ఇప్పుడు తాజాగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇదే త‌ర‌హా న్యూడ్‌కాల్ ఉచ్చులో ఇరుక్కున్నారు. ఎమ్మెల్యేకు న్యూడ్‌ వీడియోకాల్ చేసిన ఆవ‌త‌లి వ్య‌క్తి క్ష‌ణాల‌పాటు దాన్ని స్క్రీన్ రికార్డ్ చేశారు. ఆ రికార్డును ఆయ‌న‌కే పంపి డ‌బ్బులు డిమాండ్ చేశారు. ఆయ‌న స్పందించ‌క‌పోవ‌డంతో ఆ వీడియోను కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల‌కు ఆ వీడియోను పంపారు. వారు ఆ వీడియోను చూసి అవాక్క‌య్యారు. దీంతో వెంట‌నే ఆ వీడియో విష‌యంపై ఎమ్మెల్యేకు తెలిపిన‌ట్టు స‌మాచారం.

Nude Video Call:ఆ వీడియో అటు నుంచి ఇటు నుంచి తిరుగుతుంద‌ని కూడా తెలుస్తున్న‌ది. ఈ విష‌యం తెలుసుకున్న స‌ద‌రు ఎమ్మెల్యే పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. నిందితులను గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆ ఎమ్మెల్యే కోరిన‌ట్టు తెలిసింది. ఇదంతా సైబ‌ర్ నేర‌గాళ్ల ప‌ని అని ప్రాథ‌మికంగా గుర్తించిన‌ట్టు తెలిసింది. ఇప్పుడు ఈ విష‌యం ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాయే కాకుండా రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *