Musical Night

Musical Night: ఈ నెల 15 న తలసేమియా భాదితులకు సహయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్

Musical Night: విజయవాడలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరగనున్న మ్యూజికల్ నైట్.ఈ కార్యక్రమ వివరాలు మీడియా కి తెలిపిన నారా భువనేశ్వరి ఇంకా తమన్. 

ఈ నెల 15 న విజయవాడలో జరగనున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్

ఈ షో నేను చేయడం చాలా సంతోషంగా ఉంది.నారా భువనేశ్వరి ఈ కార్యక్రమం చేయాలి అని అడిగారు.తలసేమియా భాదితులకు సహాయం కోసం అని చెప్పగానే నేను వెంటనే ఈ కార్యక్రమంకి వస్తా అని చెప్పాను. భువనేశ్వరి గారు నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం నా చేతిలో పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం పగలు రాత్రి పని చేస్తున్నారు. టికెట్ పై పెట్టె ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుంది అని అన్నారు. 

ఇది కూడా చదవండి: Dollar Dreams: అప్పులు.. ఆస్తుల అమ్మకాలతో డాంకి రూటులో అమెరికాకి.. చివరికి అవమానకరంగా ఇంటికి..

నారా భువనేశ్వరి

సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది.తలసేమియా భాదితుల కోసం ఈ నెల 15 న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాము.ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా భాదితులకు అందిస్తాం. బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంది జీవితాలు నిలబడతాయి.తమన్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మ్యూజికల్ నైట్ కి వస్తా అన్నారు. తమన్ ఈ షో ఫ్రీ గా చేస్తా అని గొప్ప హృదయంతో చెప్పారు . ప్రతి ఒక్కరు తెలుగు తల్లికి రుణం తీర్చుకోవాలి. సమాజ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి.మనం వెళ్ళేటప్పుడు మన వెంట డబ్బు రాదు…ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికి గుర్తు ఉంటుంది.ప్రతి ఒక్కరు కొనే టికెట్ సమాజ సేవ కె ఉపయోగపడుతుంది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Brushing Tips: ఏ వయసు వారు ఎంత టూత్‌పేస్ట్ వాడాలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *