NTR-Neel Movie

NTR-Neel Movie: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్డేట్.. 2 వేల మందితో భారీ యాక్షన్?

NTR-Neel Movie: ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే హై-ఓల్టేజ్ యాక్షన్, హీరో ఎలివేషన్‌లకు గ్యారెంటీ! ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఆయన తెరకెక్కిస్తున్న భారీ చిత్రం అభిమానుల్లో హైప్ పెంచేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో 2 వేల మందితో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద యాక్షన్ ఎపిసోడ్‌గా నిలవనుందని, సినిమాకే హైలైట్ అని టీమ్ సన్నిహితులు చెబుతున్నారు. ఎన్టీఆర్ ఇందులో వీరోచితంగా కనిపించనున్నాడట.

Also Read: Venky: వెంకీ రీరిలీజ్ ఫీవర్: మళ్లీ థియేటర్లలో రవితేజ కామెడీ బ్లాస్ట్!

NTR-Neel Movie: షూటింగ్ నాన్‌స్టాప్‌గా సాగుతోంది. వచ్చే ఏడాది జూన్ 25న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. త్వరలో విదేశీ షెడ్యూల్‌లో మరిన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కనున్నాయి. హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, టొవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అతని పాత్ర విలన్‌దా కాదా అన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. ఈ భారీ చిత్రం అభిమానుల అంచనాలను మించి అదరగొట్టనుందని టాక్!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Lenin: అఖిల్ ‘లెనిన్’ నుంచి సరికొత్త అప్డేట్? LENIN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *