NTR-Neel

NTR-Neel: ఎన్టీఆర్-నీల్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్!

NTR-Neel: యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ ఊపందుకుంది. తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై ఓ భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించారట. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్‌తో ఈ సీన్ హైలైట్‌గా నిలవనుందని టాక్. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎన్టీఆర్ సరసన రొమాంటిక్ ట్రాక్‌తో పాటు కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రుక్మిణి వసంత్ లాంటి అందమైన టాలెంటెడ్ నటి ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో అంటేనే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కేజీఎఫ్’ లాంటి బ్లాక్‌బస్టర్‌లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నీల్, ఈసారి ఎన్టీఆర్‌తో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, సినిమా స్కేల్, యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Viral Video: ఈ కోతి డీల్ మామూలుగా లేదు.. నెటిజన్లు షాక్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *